అల్లుడికి సర్ ప్రైజ్ గిఫ్ట్‌ ఇచ్చిన మెగా బ్రదర్‌..

121
- Advertisement -

మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నీహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో గత సంవత్సరం డిసెంబర్‌లో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత నీహారిక తన సంసారంపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో వివరాలను అభిమానులతో పంచుకుంటూనే ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నాగాబాబు తన ఒక్కగానొక్క అల్లుడికి ఓ లగ్జరీ గిఫ్ట్‌ను అందించారు. అల్లుడు చైతన్యకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు.

రేంజ్‌ రోవర్‌ డిస్కవర్‌ తెలుపు రంగు కారును అల్లుడికిస్తూ.. నిహారిక, చైతన్యలను సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ విషయాన్ని నాగబాబు శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించాడు. నా అల్లుడికి ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అంటూ ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఈ మేరకు కూతురు నిహారిక, చైతన్యకు కారును డెలివరీ చేస్తున్న ఫోటోను షేర్‌ చేశారు. దీని ఖరీదు దాదాపు 70 లక్షలు ఉంటుదని అంచనా. అయితే వాస్తవానికి ఇది ఉగాదికి ఇవ్వాల్సిన కానుక అని.. కానీ కాస్త ఆలస్యం అయ్యిందని నాగబాబు తన యూట్యూబ్‌ చానల్‌లో తెలిపారు.

- Advertisement -