టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ..

175
- Advertisement -

ఐపీఎల్ 2021 నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ దశలో అడుగుపెడుతుంది. బెంగళూరు జట్టులో ఈ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు లేకపోగా, పంజాబ్ జట్టులో మాత్రం ఏకంగా మూడు మార్పులు జరిగాయి. ఫాబియన్ అలెన్ స్థానంలో హర్ ప్రీత్, దీపక్ హుడా స్థానంలో సర్ఫరాజ్ ఖాన్, ఎల్లిస్ స్థానంలో మోజెస్ హెన్రిక్స్ తుదిజట్టులోకి వచ్చారని పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు.

ఐపీఎల్ 2021లో ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడిన పంజాబ్ ఐదు విజయాలు సాధించి 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచుల్లో విజయాలు సాధిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు బెంగళూరు 11 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలిచింది. ప్రస్తుతం ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌ చేరుతుంది.

తుది జట్లు :

పంజాబ్ కింగ్స్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, ఏడైన్ మర్కరమ్, షారుఖ్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, హర్ ప్రీత్ బార్, మోజెస్ హెన్రిక్స్, మహ్మద్ షమీ,రవి బిష్ణోయ్, అర్ష దీప్ సింగ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, కోన శ్రీకర్ భారత్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్.

- Advertisement -