షార్జా వేదికగా ఐపీఎల్-13లో సోమవారం బీకర యుద్దం జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ఆడుతున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గుర్‌కీరత్ సింగ్ మన్ స్థానంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు విరాట్ చెప్పాడు. స్పిన్నర్ సునీల్ నరైన్ స్థానంలో టామ్ బాంటన్ తుది జట్టులోకి వచ్చినట్లు కోల్‌కతా సారథి దినేశ్ కార్తీక్ తెలిపాడు.
ఇప్పటివరకు లీగ్‌లో ఆడిన 6 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ 4 గెలిచి 2 ఓడిపోయింది. ప్రస్తుతం 8 పాయింట్లతో జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. ఇక కేకేఆర్ కూడా 4 మ్యాచ్‌ల్లో గెలిచి మూడో స్థానంలో ఉంది. ఇరు జట్లలో భారీ హిట్టర్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. మరీ ఏ జట్టును విజయం వరిస్తుందో చూడాలి!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ , వాషింగ్టన్ సుందర్, శివం దుబే, క్రిస్ మోరిస్, ఇసురు ఉదనా, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
కోల్‌కతా నైట్‌రైడర్స్: రాహుల్ త్రిపాఠి, శుబ్మాన్ గిల్, నితీష్ రానా, ఎయోన్ మోర్గాన్, దినేష్ కార్తీక్ , టామ్ బాంటన్, ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, కమలేష్ నాగర్‌కోటి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి