బెంగళూరు విజయ భేరి. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్-12వ సీజన్‌లో బెంగళూరుకు ఇది వరుసగా రెండో విజయం కాగా మొత్తంగా మూడోది కావడం విశేషం. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదిరిపోయే ప్రదర్శన చేసిన చెన్నై సారథి మహేంద్రసింగ్ ధోనీ (48 బంతుల్లో 84; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) పోరాటం వృథా అయింది. చెన్నైని దాదాపుగా గెలిపించినంత పనిచేశాడు. చివరి బంతికి ఒక్క పరుగు రాకపోవడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: పార్థివ్ పటేల్ (సి) వాట్సన్ (బి) బ్రావో 53; కోహ్లి (సి) ధోని (బి) చాహర్ 9; డివిలియర్స్ (సి) డుప్లెసిస్ (బి) జడేజా 25; అక్ష్దీప్ (సి) డుప్లెసిస్ (బి) జడేజా 24; స్టాయినిస్ (సి) షోరే (బి) తాహిర్ 14; మొయిన్ అలీ (సి) ఠాకూర్ (బి) బ్రావో 26; నేగి (సి) రాయుడు (బి) చాహర్ 5; ఉమేశ్ యాదవ్ నాటౌట్ 1; స్టెయిన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 161; వికెట్ల పతనం: 1-11, 2-58, 3-99, 4-124, 5-126, 6-150, 7-160; బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-25-2; శార్దూల్ ఠాకూర్ 4-0-40-0; జడేజా 4-0-29-2; డ్వేన్ బ్రావో 4-0-34-2; ఇమ్రాన్ తాహిర్ 4-0-31-1
చెన్నై సూపర్ కింగ్స్: వాట్సన్ (సి) స్టాయినిస్ (బి) స్టెయిన్ 5; డుప్లెసిస్ (సి) డివిలియర్స్ (బి) ఉమేశ్ 5; రైనా (బి) స్టెయిన్ 0; రాయుడు (బి) చాహల్ 29; జాదవ్ (సి) డివిలియర్స్ (బి) ఉమేశ్ 9; ధోని నాటౌట్ 84; జడేజా రనౌట్ 11; బ్రావో (సి) పార్థివ్ (బి) సైని 5; శార్దూల్ ఠాకూర్ రనౌట్ 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 160; వికెట్ల పతనం: 1-6, 2-6, 3-17, 4-28, 5-83, 6-108, 7-136, 8-160; బౌలింగ్: స్టెయిన్ 4-0-29-2; సైని 4-0-24-1; ఉమేశ్ యాదవ్ 4-0-47-2; నేగి 1-0-7-0; స్టాయినిస్ 3-0-20-0; చాహల్ 4-0-24-1.