ఐపీఎల్ 2025 ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. మార్చి 22న జరిగే తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడనుంది ఆర్సీబీ. ఇక ఈ సారి ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్ వ్యవహరించనుండగా కొత్త జెర్సీతో రంగంలోకి దిగనుంది ఆర్సీబీ.
2021లో బెంగళూరు ఫ్రాంచైజీలో చేరాడు రజత్ పాటిదార్. తొలి మ్యాచ్ కేకేఆర్ తో ఆ తర్వాత తన హోం గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 2న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. ఇక ఈసారి కొత్త జెర్సీతో బరిలోకి దిగనుండగా ఇందుకు సంబంధించిన కార్యక్రమం ఆకట్టుకుంది.
పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా విరాట్ కోహ్లీ..రాజత్ పటిదార్ ఆర్సీబీకి లాంగ్ టర్మ్ లీడర్ అని కొనియాడాడు. ఆర్సీబీని నడిపించడానికి రజత్‌కు పెద్ద బాధ్యత ఉందనీ, ఛాంపియన్‌గా ఉండటానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. కోహ్లీ, డివిలియర్స్ లాంటి లెజెండ్స్ ఆర్సీబీకి ఆడారని అన్నాడు. ఇప్పుడు అదే జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
ప్రతీ ఐపీఎల్ సీజన్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగిన ఆర్సీబీ ప్రతీసారి నిరాశ పర్చింది. మరి ఈసారైనా టైటిల్ గెలిచి ఫ్యాన్స్ కోరిక నెరవేరుస్తుందా వేచిచూడాలి.
Also Read:IPL 2025: ఎక్కువ సిక్స్‌లు కొట్టింది వీరే

