బెంగళూరు ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో జరిగిన తొక్కిసలాట ఘటనపై చర్యలు చేపట్టింది పోలీసు శాఖ. ఈ నైపథ్యంలో ఆర్సీబీ జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసలెను బెంగళూరు ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు పోలీసులు. ముంబయి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇక ఘటనను కర్ణాటక సీఎం సిద్దరామయ్య సీరియస్‌గా తీసుకున్నారు. RCB ప్రతినిధులను అరెస్ట్ చేయండి… బెంగళూరు తొక్కిసలాట ఘటనలో RCB, DNA మేనేజ్మెంట్, KSCA ప్రతినిధులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరు తొక్కిసలాట ఘటన.. పలువురు పోలీసులను సస్పెండ్ చేశారు.
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. బెంగళూరు సీపీ దయానంద్ సహా డీసీపీ శేఖర్, ఏసీపీలు వికాస్ కుమార్, బాలకృష్ణ సహా ఇన్స్పెక్టర్ గిరీష్‌ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం.
Also Read:గ్రాండ్‌గా అఖిల్ అక్కినేని పెళ్లి..

