వివాహ బంధంలోకి అడుగుపెట్టారు అఖిల్ అఖినేని. తెల్లవారుజామున అన్నపూర్ణ స్టూడియోస్ లో తన ప్రేయసి జైనబ్ ను వివాహం చేసుకున్నారు అఖిల్.ఈ వివాహ వేడుకకు హజరైన చిరంజీవి, రామ్ చరణ్-ఉపాసన, శర్వానంద్, ప్రశాంత్ నీల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
గతేడాది నవంబర్ 26న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ అయిన విషయం తెలిసిందే. అతికొద్ది మంది బంధుమిత్రులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. వెంకటేష్, రానా, సురేష్ బాబు వంటివారు ఈ పెళ్ళి వేడుకలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. లాంటి మీడియా కవరేజీకి అనుమతివ్వలేదు.
అయితే ఇప్పటికే సందడిగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ నిర్వహించారు. ఇందులో అక్కినేని ఫ్యామిలీ పాల్గొంది. ఇక పెళ్లిలో అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల, సుశాంత్, సుమంత్, అక్కినేని వెంకట్, నాగసుశీల, సుప్రియా, వారి ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్నారు.
Also Read:మోనోపాజ్ సమస్యా..ఇవి పాటించండి!

