దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ క్రిస్టెన్ ..కోహ్లి సేనకు కోచ్‌గా మారనున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంకానున్న ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.
వచ్చే సీజన్ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే కసరత్తులు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టన్‌ను ఆర్‌సీబీ బ్యాటింగ్ కోచ్‌గా తీసుకోవాలన్న దిశగా అడుగులు వేస్తోంది. దీనిపై ఇప్పటికే గ్యారీతో సంప్రదింపులు జరిగినట్లు సమాచారం.
2011లో టీమిండియాకు కోచ్‌గా గ్యారీ..కెప్టెన్ ధోని సారథ్యంలో వరల్డ్ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్‌లో 2014, 2015 ఐపీఎల్ సీజన్లలోఢి ల్లీ డేర్‌డెవిల్స్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. కానీ ఆకట్టుకోలేక పోయాడు. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ కోచ్‌గా ఉన్న గ్యారీ తాజాగా ఐపీఎల్‌లో బెంగళూరుకు కోచ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 2016లో రన్నరప్‌గా నిలిచిన ఆర్‌సీబీ 2017లో 14 లీగ్ మ్యాచుల్లో కేవలం మూడింట్లోనే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో గ్యారీ వైపు ఆర్సీబీ యాజమాన్యం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.