ఐపీఎల్-13లో శనివారం రాత్రి మరో ఆసక్తికర మ్యాచ్ జరగనున్నది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. క్రిస్ మోరీస్, గుర్‌కీరత్ సింగ్ మన్‌లను తుది జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు. క్రిస్ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఇక ధోనీ సేన జట్టులో ఒక మార్పుచేసింది. గత మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేసిన కేదార్ జాదవ్‌ను పక్కన బెట్టారు. అతడి స్థానంలో ఎన్. జగదీశన్‌ను జట్టులోకి తీసుకొచ్చారు.
ఇప్పుడు అందరి కళ్లు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీలపైనే పడ్డాయి. వరుస విజయాలతో ఊపులో ఉన్న ఆర్‌సీబీ ఈ పోరులోనూ అదే ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉంది. వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిచి గాడిలో పడాలని భావిస్తోంది.
జట్ల వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, ఫాప్ డుప్లెసిస్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), ఎన్ జగదీశన్, సామ్ కరన్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, కరన్ శర్మ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: దేవదూత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కొహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (వికెట్ కీపర్), గురుకీరట్ సింగ్ మాన్, శివమ్ దుబే, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, ఇసురు ఉదానా, నవదీప్ శైని, యుజ్వేంద్ర చాహల్