- Advertisement -
హ్యాట్రిక్ పరాజయాల తర్వాత గెలుపు బాటపట్టింది ఆర్సీబీ . చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆర్సీబీ విధించిన 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లో 8 వికెట్లు కొల్పోయి 160 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ విజయం సాధించింది.
కాన్వే (37 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా రుతురాజ్ (23 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) ,జడేజా (3)ను, మొయిన్ అలీ ( 34),ధోని (2) పరుగులు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్షల్ పటేల్ (3/35) కీలక వికెట్లు తీశాడు.
మొదట బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. మహిపాల్ లొమ్రోర్ (27 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. డు ప్లెసిస్ (22 బంతుల్లో 38 ),కోహ్లి (33 బంతుల్లో 30) పరుగులు చేశారు.
- Advertisement -