చరణ్ కి లీకుల గొడవ

141
- Advertisement -

శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ ఓ భారీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ్ తో పాటు మిగతా భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. సినిమా ఎక్కువ భాగం రాజమండ్రి లో జరుగుతుంది. ఇప్పటికే పలు షెడ్యుల్స్ చేసిన యూనిట్ తాజాగా రాజమండ్రి లో మరో షెడ్యుల్ చేస్తున్నారు. గోదావరి తీరాన పొలిటికల్ మీటింగ్ తో సన్నివేశాలు తీస్తున్నారు. ఈ లోపు కొందరు అభిమానులు ఆ లొకేషన్ ,చరణ్ ఫోటోలు , వీడియోలు తీసి సోషల్ మీడియాలో లీక్ చేసేశారు.

దీంతో ఆర్సీ 15 షూటింగ్ ఫొటోస్ , వీడియోలు వైరల్ అయ్యాయి. తక్షణమే టీం అలర్ట్ అయ్యారు. వెంటనే ఫోటోలు , వీడియో డిలీట్ చేయకపోతే ట్విట్టర్ ఎకౌంట్స్ ఎగిరిపోతాయని అలర్ట్ ప్రకటించారు. అంతే కాదు చరణ్ టీం కూడా మీడియా వారికి ఈ ఇన్ఫో పాస్ చేసి వాటిని ఎక్కడా పోస్ట్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. ఏదేమైనా ఆర్సీ 15 లీకులు ఇది మొదటి సారి కాదు. సినిమా ఆరంభం నుండి ఏవో లీకులు వస్తూనే ఉన్నాయి.వాటిని ఫ్యాన్స్ వైరల్ చేస్తూనే ఉన్నారు. వైజాగ్ షెడ్యుల్ నుండి ఇదంతా జరుగుతూనే ఉంది.

మరి ఇప్పటికైనా టీం అలర్ట్ అయి ఇకపై ఇలాంటి లీకులు లేకుండా జాగ్రత్త పడాల్సి ఉంది. ఏదేమైనా ఈ సినిమాకు ఆల్మోస్ట్ అన్నీ అవుట్ డోర్ లోకేషన్స్ కాబట్టి కంట్రోల్ చేయడం కూడా కష్టమే.

ఇవి కూడా చదవండి…

ఎన్టీఆర్ – కొరటాల..ఫుల్ మాస్

వైరల్ : బాలయ్యతో పవన్

ప్చ్.. ఆ స్టార్ హీరో కూతురు కూడానా!

- Advertisement -