రామ్ చరణ్ , శంకర్ కాంబో సినిమా గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బైక్ పై చరణ్ కూర్చొని వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చరణ్ లాంగ్ హెయిర్ తో స్టైలిష్ గా కనిపించాడు. కానీ ఇందులో కొత్తదనం కనిపించలేదు. గతంలో చరణ్ చేసిన బ్రూస్ లీ లుక్ నే ఇందులో కూడా కనిపించింది తప్ప కొత్తగా లేదు. దీంతో ఫ్యాన్స్ ఈ ఫస్ట్ లుక్ పై నిరాశపడ్డారు.
ఈ సినిమాలో చరణ్ సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఆ గెటప్ తో స్టిల్స్ లీకయ్యాయి. ఆ గెటప్ స్టిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఆశించారు కానీ మేకర్స్ మాత్రం స్టాలిష్ లుక్ తోనే ఫస్ట్ లుక్ వదిలి చరణ్ కి విషెస్ చెప్పారు. చరణ్ పుట్టిన రోజు పురస్కరించుకొని ఈరోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
టైటిల్ కూడా ఇంగ్షీష్ డబ్బింగ్ టైటిల్ లా ఉండనే కామెంట్స్ వస్తున్నాయి. ఏదేమైనా శంకర్ ఈసారి ఫ్యాన్స్ ను సర్ప్రయిజ్ చేయలేకపోయాడు. ఊహించని టైటిల్ , పాత లుక్ తో మెప్పించలేకపోయాడు.
ఇవి కూడా చదవండి…