RC16:రామ్‌చరణ్ బర్త్ డే స్పెషల్

4
- Advertisement -

రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఇవాళ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘ఆర్‌సీ16’ ఫ‌స్ట్‌లుక్, టైటిల్ నేమ్‌ని రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జరుగుతుండగా చరణ్‌ బర్త్ డే సందర్భంగా టైటిల్‌ని రివీల్ చేశారు. ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా గుర్తింపు కోసం పోరాటం అంటూ ఈ ఫ‌స్ట్ లుక్‌కి క్యాప్ష‌న్ ఇచ్చారు మేక‌ర్స్.

ఉత్త‌రాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. మైత్రీమూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో, వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్‌ఇండియా ప్రాజెక్ట్‌లో కన్న‌డ చ‌క్ర‌వ‌ర్తి శివ‌రాజ్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఏఆర్ రెహ‌మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Also Read:ఢిల్లీలో కుస్తీ…గల్లీలో దోస్తీ: వివేకా

- Advertisement -