పెద్దనోట్ల రద్దు తరువాత రూ. 2000 నోటు, రూ. 200 ఓటు, రూ. 50 నోట్లను అందుబాటులోకి తెచ్చింది ఆర్బీఐ. ఇప్పుడు తాజాగా ముదురు నీలం రంగులో రూ.100 రూపాయల నోటును విడుదల చేసింది. ఈ కొత్త రూ.100 నోటు వెనక భాగాన ఒక వైపు గుతరాత్లోని 11వ శతాబ్ధానికి చెందిన చారిత్రాత్మక కట్టడమైన ‘రాణికి వావ్’ను ముద్రించింది. పాత రూ.100 నోటు కంటే కొంచెం చిన్నదిగా.. కొత్త రూ.10 నోటుతో పోలిస్తే కొంచెం పెద్దదిగా ఉంటుందని చెప్పింది.
త్వరలోనే బ్యాంకుల ద్వారా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది. ఈ నోటుపై 100ను దేవ నాగరి లిపిలోనూ ముద్రించారు. ఈ నోటును మడిచినప్పుడు థ్రెడ్ కలర్ నుంచి ఆకుపచ్చ రంగులోకి మారుతుందని తెలిపింది.
కొత్త రూ.100 నోట్లను కూడా రూ. 2000 నోట్లు ప్రింటింగ్ చేస్తున్న దేవాస్ లోని ప్రెస్ లోనే ముద్రిస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త నోట్ల ముద్రనకు విదేశాల నుంచి తెచ్చిన సిరానే వాడుతున్నారట. అయితే పాత రూ. 100 నోటు చలామణిలోనే ఉంటుంది. అందులో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ బ్యాంకులు మాత్రం.. ఏటీఎంలలో ట్రేలను మార్చుకోవలసి ఉంటుంది.