పాత పెన్షన్ విధానం(ఓపీఎస్)ను పునరుద్ధరించడవల్ల భవిష్యత్‌లో రాష్ట్రాల ఆర్థిక వనరులపై తీవ్ర ఒత్తడి పడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానంను తీసుకువచ్చేలా ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. 2022-23 బడ్జెట్లపై అధ్యయనం పేరుతో వెలువడిన నివేదికలో ఆర్బీఐ పాత పెన్షన్ విధానంను గూర్చి స్పష్టం చేసింది.
ప్రస్తుత ఖర్చులను వాయిదా వేయడం వల్ల రాబోయే సంవత్సరాల్లో కేటాయింపుల వద్ద నిధుల సమీకరణ కొరవడిన పాత పెన్షన్ బకాయిలను సర్ధుబాటు చేయడం కష్టతరమవుతుందని వెల్లడించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు పాత పెన్షన్ విధానంను తీసుకురావాడానికి ప్రయత్నిస్తున్నట్టు తమ నివేదికలో పేర్కొంది. ఇటీవల కొలువుతీరిన హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం డీఏ ఆధారిత ఓపీఎస్ పునరుద్ధిరిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
రాజస్థాన్ చత్తీస్‌ఘఢ్ జార్ఖండ్ రాష్ట్రాల ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేస్తామని కేంద్రంతో పాటుగా పెన్షన్ అండ్ ఫండ్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ)కి సమాచారం పంపించింది. పంజాబ్‌లోనూ ఆప్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నూతన పెన్షన్ విధానంను (ఎన్‌పీఏ) ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి…