కేంద్ర ప్రభుత్వం పాత నోట్లను రద్దు చేస్తూ కొత్త నోట్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా రూ. 1000నోటు స్ధానంలో రూ.2000నోటు ప్రేవేశపెట్టింది. తాజాగా మరో నిర్ణయానికి తెరలేపింది ఆర్బీఐ. కొత్త రూ. 100నోటును మార్కెట్ లోకి తెస్తున్నట్లు ఇటివలే ప్రకటించింది. కొత్త రూ.100నోటును కూడా విడుదల చేసింది. అయితే తాజాగా విడుదలైన కొత్త వంద నోటు వల్ల కొత్త కష్టాలు వచ్చాయి.
అంతేకాకుండా కొత్త వంద నోట్ల వల్ల ఆర్బీఐకి వంద కోట్ల ఖర్చు అయిందట. ఈ నోట్లను అందుబాటులోకి తీసుకురావడానికి, ఏటీఎంలను మార్చాల్సి వస్తోంది. ఇప్పడు ఉన్న ఎటీఎంలను మార్చి కొత్త వాటిని అమర్చాలని చెబుతున్నారు ఏటీఎం ఆపరేటర్లు. ఈసందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 2లక్షల 40వేల ఏటీఎంల ను కొత్త వందనోటుకు అనుగుణంగా మర్చాలని అందుకోసం దాదాపు రూ.100కోట్ల ఖర్చవుతుందన్నారు.
ఇలా ఏటీఎం లను మార్చడానికి ఏడాది కంటే ఎక్కువే సమయం పడుతుందన్నారు. కొత్త వందనోట్ల ప్రింటింగ్ ఇప్పటికే దేవాస్ లో ప్రారంభమైందన్నారు ఆర్బీఐ సీనియర్ అధికారి. ఇక మళ్లి ఏటీఎం లను మార్చే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో అన్ని భయపడిపోతున్నారు ప్రజలు. ఇటివలే ఆర్బీఐ షాంపిల్ గా కొత్త వంద నోటును రిలీజ్ చేసింది.