సైబర్ మోసాలు.. బాధితులకు రూ.25 వేలు పరిహారం

6
- Advertisement -

సైబర్ మోసాల బారిన పడుతున్న ప్రజలకు ఉపశమనంగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ మోసాల్లో డబ్బులు కోల్పోయిన బాధితులకు పరిమిత పరిహారం అందించే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

ఈ మార్గదర్శకాల ప్రకారం, రూ.50 వేల వరకు నష్టపోయిన బాధితులకు మాత్రమే పరిహారం వర్తిస్తుంది. అందులో కూడా గరిష్టంగా రూ.25 వేల వరకు లేదా నష్టపోయిన మొత్తం సొమ్ములో 85 శాతం – ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని పరిహారంగా అందించనున్నారు. అయితే ఈ అవకాశం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది.

పరిహారం పొందాలంటే బాధితుడు తప్పనిసరిగా 5 రోజుల లోపు సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. ఆలస్యమైతే ఈ సదుపాయం వర్తించదు. థర్డ్ పార్టీ ఉల్లంఘనల కారణంగా జరిగిన నష్టాలకు తాత్కాలిక ఉపశమనంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

పరిహారం పంపిణీలో కూడా బాధ్యతను పంచుకున్నారు. ఉదాహరణకు రూ.25 వేల పరిహారంలో సుమారు రూ.19,118ను ఆర్బీఐ భరిస్తే, మిగిలిన రూ.2,941ను సంబంధిత బ్యాంకు భరించనుంది.

డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా అధికమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బాధితులకు కొంత ఉపశమనాన్ని కల్పించే చర్యగా ఈ నిర్ణయాన్ని ఆర్థిక నిపుణులు అభినందిస్తున్నారు.

Also Read:హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

- Advertisement -