లాక్ డౌన్‌తో ప్రపంచ మార్కెట్లన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభం నెలకొందన్నారు.
ఇప్పటివరకు 1.20 లక్షల కోట్లు విడుదల చేశామని..బ్యాంకులకు నిధుల కొరత రాకుండా చూశామని తెలిపారు. బ్యాంకుల దగ్గర సరిపడా నిల్వలున్నాయని వెల్లడించారు.
ఆర్ధిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని తెలిపారు. కరోనా ప్రభావంతో ఆటోమొబైల్ రంగం పూర్తిగా దివాళ తీసే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రాలకు 60 శాతం డ్యబ్లూఎంఏ పెంచినట్లు వెల్లడించారు. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో వరి సాగు పెరిగిందన్నారు.
నాబార్డుకు రూ. 25 వేల కోట్లు ,చిన్న తరహాపరిశ్రమలకు రూ. 50 వేల కోట్లు విడుదల చేశామని తెలిపారు. జీడీపీలో 3.2 శాతం ద్రవ్యోల్బణం అందుబాటులోకి తెచ్చామన్నారు. 2021-22లో భారత వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండే అవకాశం ఉందన్నారు. రివర్స్ రేపో రేటు 4 శాతం నుండి 3.75 తగ్గించామన్నారు. క్వారంటైన్‌లో ఉండి సేవలు అందిస్తున్న బ్యాంకు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.