భారీగా వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ

8
- Advertisement -

వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది ఆర్బీఐ. దీంతో వరుసగా మూడోసారి రెపోరేటు తగ్గించాయి. 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. రెపోరేటు 6 నుంచి 5.5 శాతానికి తగ్గించారు. హోమ్‌, వెహికల్‌, పర్సనల్‌ లోన్లపై వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది.

ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో గృహ రుణాల వడ్డీరేట్లు 7.5 శాతం తగ్గనున్నాయి. అలాగే బ్యాంకు ఈఎంఐలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.16 శాతంగా ఉంది.

వడ్డీ రేట్లను తగ్గించడం ఈ ఏడాదిలో వరుసగా ఇది మూడోసారి. ఫిబ్రవరి, ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించారు. తాజాగా మళ్లీ వడ్డీ రేట్లు తగ్గించడం ద్వారా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది.

Also Read:Musk:ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..

- Advertisement -