ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్ తగిలింది. డొనాల్డ్ ట్రంప్ పై సంచలన ఆరోపణల నేపథ్యంలో మస్క్ బయటకు రాగా బిగ్ షాక్ తగిలింది. మస్క్‌కు సంబంధించిన షేర్లు భారీ నష్టాలను చూశాయి.
ట్రంప్ – మస్క్ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో 14శాతం మేర టెస్లా షేర్లు పడిపోయాయి. దీంతో 153 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 13లక్షల కోట్లు)కుపైగా నష్టం వాటిల్లింది. కంపెనీ మార్కెటల్ విలువ 1 ట్రిలియన్ డాలర్ల మార్కు కంటే దిగువకు పడిపోయి, 916 బిలియన్ డాలర్ల వద్ద ముగిసింది. టెస్లా సంపద ఒక్కరోజులోనే ఈ స్థాయిలో తరిగిపోవడం సంస్థ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ సంవత్సరం ఇప్పటి వరకు టెస్లా షేర్లు దాదాపు 30శాతం తగ్గాయి. డిసెంబర్ 18న చూసిన గరిష్ట స్థాయి 488.54డాలర్లు హై నుంచి ఇది చాలా తక్కువ.
Also Read:గ్రాండ్‌గా అఖిల్ అక్కినేని పెళ్లి..

