బేబీ పై రవితేజ ప్రశంసలు

48
- Advertisement -

ఇప్పుడు ఎక్కడ చూసిన ‘బేబీ’ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఈ సినిమాకి మొదటి షోకి కొంచెం డివైడ్ టాక్ వచ్చినా, మొదటి రోజు పూర్తయ్యే సరికి ఒక కల్ట్ లవ్ స్టోరీ సినిమాగా అందరి చేత ప్రసంశలు పొందింది. అయితే ఈ చిన్న సినిమా ఒక పెద్ద విజయానికి చరిత్ర సృష్టించే దిశగా వెళుతోంది. తాజాగా ‘బేబీ’ సినిమా చూసిన రవితేజ.. చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు. ‘సాయి రాజేష్ అద్భుతంగా సినిమా రూపొందించాడు. సాంకేతిక బృందం గొప్పగా పని చేశారు.

ముఖ్యంగా విజయ్ బుల్గానిన్ సంగీతం చాలా బాగుంది. ఇక నటీనటులైన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్ తమ పాత్రల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసారు. ఈ అందమైన కథని నిర్మించిన SKN మరియు మాస్ మూవీమేకర్స్‌ కు అభినందనలు’ అంటూ రవితేజ ట్వీట్ చేశారు. మొత్తమ్మీద ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య – విరాజ్ ప్రధానమైన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబి’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా టీమ్ హైదరాబాదులో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను నిర్వహించింది.

Also Read:యుఎస్‌లో ప్రభాస్ మేనియా

దీనికి ముఖ్య అతిథిగా హీరో విజయ్ దేవరకొండ వచ్చారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “ఈ సినిమా చూస్తూ నేను ఒక యాక్టర్ ను అనే విషయం మరిచిపోయాను. ఈ కథ అంతా నిజంగా జరిగిందేమోనని అనుకున్నాను” అని చెప్పుకొచ్చాడు. అన్నట్టు ఈ సినిమా OTT రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఈ చిత్రం ఆగస్టు 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా OTT ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read:రేవంత్‌రెడ్డి ఓ దుష్టుడు..దాసోజు శ్రావణ్ బహిరంగ లేఖ

- Advertisement -