రవితేజ@ రావణాసుర

103
rt
- Advertisement -

మాస్ మహారాజ రవి తేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికి ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి. తాజాగా రవితేజ 70వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఇచ్చారు మేకర్స్. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ లుక్‌ని రివీల్ చేశారు. ‘రావణాసుర’ టైటిల్‌నే కన్‌ఫర్మ్ చేస్తూ తాజాగా రవితేజ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ వదిలారు. పది తలలతో డిజైన్ చేసిన ఈ పోస్టర్ బాగా ఆకట్టుకుంటోంది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం రవితేజ.. ‘ఖిలాడి’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ‘రామారావు ఆన్‌డ్యూటీ’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రాలను చేస్తున్నాడు.

- Advertisement -