మాస్ మహారాజ్ రవితేజ, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూవీ ‘అమర్ అక్బర్ ఆంటోని’. ఈసినిమాలో రవితేజ సరసన సీనియర్ హీరోయిన్ ఇలియాన నటిస్తుంది. మ్రైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వస్తుంది. నవంబర్ 16న విడుదల చేయనున్నారు. ఈసినిమాకు థమన్ సంగీతం అందించగా, వెన్నెల కిషోర్, రవి ప్రకాశ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు ముఖ్య పాత్రలో పోషిస్తున్నారు.
ఈ చిత్రం ఆడియో వేడుకను ఈనెల 10న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధగా సూపర్ స్టార్ మహేశ్ బాబు హాజరుకానున్నాడని సమాచారం. దర్శకుడు శ్రీనువైట్ల, మహేశ్ బాబుల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే ఈవేడుకకు రానున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దూకుడు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
రవితేజ చివరగా నటించిన చిత్రం నేల టికెట్టు ఆడియో ఫంక్షన్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈసినిమా ఆడియో వేడుకకు మహేశ్ బాబు గెస్ట్ గా వస్తుండటంతో సంతోషంలో ఉన్నారు చిత్ర యూనిట్. శ్రీనువైట్ల- రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన ‘నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను’ వంటి చిత్రాలు మంచి విజయం సాధించడంతో ‘అమర్ అక్బర్ ఆంటోని’సినిమాపై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు రవితేజ అభిమానులు.