#RT4GM నుండి బ్లాస్టింగ్ అప్‌డేట్స్

51
- Advertisement -

టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్- మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని మరోసారి జతకట్టారు. గతంలో డాన్ శీను, బలుపు ,క్రాక్ చిత్రాలతో మూడు బ్లాక్‌బస్టర్‌లను అందించిన ఈ మ్యాసీ కాంబో- #RT4GM కోసం నాల్గవసారి కలిసి పని చేయనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది

#RT4GM వాస్తవ సంఘటనల ఆధారంగా యూనిక్, పవర్ ఫుల్ కథతో రూపొందనుంది. కొన్ని నెలల క్రితం పవర్ ఫుల్ పోస్టర్‌ ద్వారా సినిమాని అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ‘బ్లాస్టింగ్ అప్‌డేట్‌ల కోసం సిద్ధంగా ఉండండి’ అని అనౌన్స్ చేశారు. ఈరోజు, రేపు ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లు వస్తాయి.ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేశారు మేకర్స్. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఇంటెన్స్ లుక్ లో కనిపించారు సెల్వరాఘవన్. ఈ పాత్ర డిఫరెంట్ అండ్ మెమరబుల్ గా ఉండబోతుంది.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. సెన్సేషనల్ కంపోజర్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. క్రాక్, బిగిల్, మెర్సల్, ఇటివలే ‘జవాన్’ లాంటి విజయవంతమైన చిత్రాలకు పని చేసిన స్టార్ డీవోపీ జికే విష్ణు.. ఈ చిత్రంతో మరోసారి రవితేజ, గోపీచంద్ మలినేనితో కలిసి పని చేయనున్నారు.

రవితేజ ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని పాత్రలో నటించనున్నారు. ఇందులో కొంతమంది సర్ప్రైజింగ్ స్టార్ కాస్ట్, టెక్నికల్ టీం పని చేయనున్నారు.

Also Read:చర్మం నల్లబడుతుందా..ఇలా చేయండి!

- Advertisement -