ధమాకా డే వన్ కలెక్షన్స్ ఎంతంటే?

215
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రవితేజ ఎనర్జీని, మాస్‌ని ఆకట్టుకునే ఎలిమెంట్స్‌ని మాస్‌ విపరీతంగా ఎంజాయ్‌ చేస్తున్నారు. క్రిస్మస్ హాలిడేస్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ రాక కూడా షో బై షో కి పెరుగుతుంది. దర్శకుడు త్రినాధ రావు నక్కిన డైరెక్షన్ లో రవితేజ నటించిన ఈ సినిమాలో మాస్ మహారాజా నుండి ఆశించే అన్ని అంశాలు చక్కగా కుదరంతో డే వన్ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది.

మాస్‌తో పాటు క్లాస్ సెంటర్స్‌లోనూ అనూహ్యంగా బిజినెస్ చేసింది ధమాకా. బాక్సాఫీస్ వద్ద రవితేజకు ధమాకా బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. చాలా సెంటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. నైజాంతో సహా చాలా సెంటర్లలో రవితేజకి ధమాకా బిగ్గెస్ట్ డే వన్ గ్రాసర్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 10Cr+ వసూలు చేసింది.

క్రిస్మస్ హాలిడేస్ పైగా వీకెండ్ కావడంతో ఈరోజు రేపు సినిమా ఇంకా భారీ ఎత్తున వసూళ్ళు అందుకోవడం ఖాయమనిపిస్తుంది. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు ఇరవై కోట్ల గ్రాస్ దాటేసే అవకాశం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి…

వీరసింహారెడ్డికి రెండు ఈవెంట్ లు !

క్రిస్మస్‌ కానుకగా మేరీ క్రిస్టమస్ పోస్టర్‌

హీట్‌ పుట్టిస్తోన్న అనసూయ…

- Advertisement -