మాస్ మహారజా రవితేజ నెలకో హిట్టు కొడుతూ ముందుకెళ్తున్నాడు. వరుస అపజయాలు చూసిన రవితేజ కి ‘క్రాక్’ బ్లాక్ బస్టర్ అందించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఖిలాడీ’ , ‘రామరావు ఆన్ డ్యూటీ’ సినిమాలు రవితేజ కెరీర్ గ్రాఫ్ ను అమాంతంగా తగ్గించేశాయి. తాజాగా రవితేజ డబుల్ బ్లాక్ బస్టర్స్ అందుకొని మళ్ళీ కెరీర్ గ్రాఫ్ పెంచేసుకున్నాడు.
డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ‘ధమాకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ. ఈ సినిమా ఎంతటి విజయం సాదించిందో తెలిసిందే. ఫస్ట్ టైమ్ ఈ సినిమాతో 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో నిలిచాడు మాస్ మహరాజా. ‘ధమాకా’ సక్సెస్ ను ఎంజాయ్ చేసే లోపే రవితేజ కి వాల్తేరు వీరయ్య తో మరో బ్లాక్ బస్టర్ తగిలింది. ఈ సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లో చేరింది.
అయితే వాల్తేరు వీరయ్య కి సంబంధించి చిరు తర్వాత క్రెడిట్ దక్కేది రవితేజ కే. సెకండాఫ్ లో రవితేజ కేరెక్టర్ సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది. అందుకే వీరయ్య విజయంలోనూ రవితేజ కి భాగం ఉంది. సో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో రవితేజ ఫుల్ కిక్ లో ఉన్నాడు. నెక్స్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’, రావణాసుర’, ఈగల్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు రవితేజ నెక్స్ట్ రిలీజ్ కాబోయే సినిమాకు రిలీజ్ కి ముందే మంచి బిజినెస్ జరగడం ఖాయం.
ఇవి కూడా చదవండి…