“డిస్కో రాజా” టీజర్ వచ్చేస్తుంది..

444
disco-rajaa
- Advertisement -

మాస్ మహారాజ్ రవితేజ గత కొంత కాలంగా ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ఆయన డిస్కో రాజా మూవీ చేస్తున్నాడు. వీఐ ఆనంద్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఈమూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటివలే డిస్కో రాజా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకున్నాడు రవితేజ. తాజాగా ఈమూవీకి సంబంధించిన మరో అప్ డేట్ ను ప్రకటించారు చిత్ర నిర్మాతలు. వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదిన ఈసినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు.

ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ తళ్లూరి నిర్మిస్తున్న ఈసినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఈమూవీతో ఎలాగైన హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు రవితేజ. రవితేజ అంచనాలను డిస్కో రాజా అందుకుంటుందో చూడాలి మరి.

- Advertisement -