రవితేజ ‘RT70’ అప్‌డేట్‌..

123
- Advertisement -

మాస్‌ మహారాజ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రవితేజ కథానాయకుడిగా రూపొందిన ‘ఖిలాడి’ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా షూటింగు జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాతో పాటు ఆయన ‘ధమాకా’ కూడా చేస్తున్నాడు.

నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘ధమాకా’ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన నాయికగా ‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. కెరియర్ పరంగా రవితేజకు ఇది 69వ సినిమా. ఆల్రెడీ ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుని సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది.

ఈ క్రమంలోనే రవితేజ కెరీర్‌లో 70వ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను రేపు (అక్టోబర్ 31 ఆదివారం) ఉదయం 10 గంటల 8 ని.లకు రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి రవితేజ ఈ కొత్త మూవీని ఎవరితో ప్లాన్ చేశారో తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే.

- Advertisement -