‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గ్లింప్స్‌.. ముహుర్తం ఫిక్స్..

65
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 7న విడుదల కానుంది.

కాగా ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్‌ను ఇచ్చారు. నవంబర్ 1 న ఉదయం 11 గంటలకు గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు చరణ్, తారక్‌లపై డిజైన్ చేసిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను వదిలారు. ఈ గ్లింప్స్‌ 45 సెకండ్ల నిడివి ఉంటుందని సమాచారం. ఇక ఈ గ్లింప్స్‌ ఏ రేంజ్‌లో ఉంటుందోనని మెగా, నందమూరి అభిమానులే కాక ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -