మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ఎంటర్టైనర్ ‘ఖిలాడి`. హవీష్ ప్రొడక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్‌లైన్. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ కోనేరు నిర్మాత. డా. జయంతీలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ మూవీ దసరా రోజుల్లోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాను దీపావళికి విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. త్వరలోనే ఫస్టు సింగిల్ పలకరించనున్నట్టు చెబుతున్నారు. అర్జున్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, సచిన్ కేడ్కర్ .. ముఖేశ్ రుషి .. ఉన్ని ముకుందన్ .. రావు రమేశ్ .. మురళీశర్మ .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.