టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొంతకాలం క్రితం పూరి జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా ప్లాన్ చేసుకున్నాడు. అంతేకాదు ఈ మూవీ కోసం ‘ఆటో జానీ’ కథను రెడీ చేసుకుని వెళ్లి చిరుకు వినిపించాడు. టైటిల్ తో పాటు ఫస్టాఫ్ చిరంజీవికి బాగా నచ్చిందట. అయితే సెకండాఫ్ విషయంలో మాత్రం చిరంజీవి కాస్త అసంతృప్తిగా ఉన్నాడనే టాక్ వచ్చింది. ఒకటికి రెండు సార్లు పూరి మార్చేసి వినిపించినా ప్రయోజనం లేకపోయింది. దాంతో పూరి దగ్గర ఆ కథ అలా ఉండిపోయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై మళ్లీ ఫిల్మ్ వర్గాల్లో ఒక వార్త జోరుగా షికారు చేస్తోంది.
అయితే ఇప్పుడు ఇదే కథను పూరి..మాస్ మహారాజా రవితేజకు వినిపించాడట. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా మార్చమని రవితేజ చెప్పడంతో, అందుకు పూరి ఓకే అన్నట్టుగా సమాచారం. పూరి – రవితేజ ఇద్దరూ మంచి స్నేహితులు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో ‘ఇడియట్’ .. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు 6వ సినిమాకి లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. ప్రస్తుతం పూరి ఈ ప్రాజెక్టు పైనే దృష్టి పెట్టాడని చెబుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.