ఢిల్లీలో మళ్లీ లాక్ డౌన్‌ పొడిగింపు..

99
Lockdown in Delhi
- Advertisement -

కరోనా మహమ్మారి విలయతాడవం చేస్తున్న దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్‌ను మళ్లీ పొడిగించారు. క‌రోనా వ్యాప్తి దృష్ట్యా ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌రో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్టు సీఎం కేజ్రీవాల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న లాక్‌డౌన్ గ‌డువు వ‌చ్చే సోమ‌వారం(మే 3వ తేదీ) ఉద‌యం 5 గంట‌ల‌కు ముగియ‌నుంది. అయితే క‌రోనా పాజిటివ్ కేసులు రోజుకు 25 వేల‌కు మించ‌కుండా న‌మోదు అవుతుండ‌టంతో లాక్‌డౌన్‌ను మ‌రో వారం రోజుల పాటు పొడిగించారు. ఢిల్లీలో ఏప్రిల్ 19 నుంచి లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది.

ఢిల్లీలో కరోనా పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి. ఆక్సిజన్ దొరక్క కరోనా రోగులు మృత్యువాత పడడం కలవరపాటుకు గురిచేస్తోంది. దీనిపై సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ, కరోనా రోగులు ఈ విధంగా మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. ఢిల్లీకి ప్రస్తుత పరిస్థితుల్లో 976 టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా, 312 టన్నులు మాత్రమే సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. ఇంత తక్కువ స్థాయిలో ప్రాణవాయువు అందిస్తుంటే ఢిల్లీ ఎలా ఊపిరి పీల్చుకుంటుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -