నేల టికెట్ బ్యాచ్‌లో జగపతిబాబు

194
Ravi Teja to lock horns with Jagapathi Babu
- Advertisement -

రాజా ది గ్రేట్ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ప్ర‌స్తుతం విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టచ్ చేసి చూడు’ లో హీరోగా నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే కళ్యాణ్ కృష్ణ మూవీ మొదలు పెట్టె అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కథ బాగా నచ్చడం తో రవితేజ వెంటనే కళ్యాణ్ కృష్ణ కు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

జనవరి 5న షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు ‘నేల టికెట్’ అనే పక్కా మాస్ టైటిల్ ఫిక్స్ చేశారు. మొదట్లో ఈ సినిమాకు ‘బంగార్రాజు’ అనే టైటిల్ ప్రచారం ఉన్నప్పటికీ.. ఫైన‌ల్‌గా ‘నేల టికెట్’కే మొగ్గుచూపించి చిత్రయూనిట్. ఈ చిత్రంలో సీనియర్ నటుడు జగపతిబాబు మరో కీలక రోల్ చేయబోతున్నట్టు సమాచారం.

ఇప్పటివరకు సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి ఫ్యామిలీ కథలతో ఆకట్టుకున్న కళ్యాణ్ కృష్ణ.. రవితేజ కోసం ఓ మాస్ మసాలా చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.

- Advertisement -