విరుష్క జోడికి యువీ వెరైటీ విషెస్‌..

184
Anushka Sharma and Virat Kohli's Mumbai reception
- Advertisement -

భారత క్రికెట్‌ జట్టు సారథి కోహ్లీ,ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మంచి స్నేహితలు అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు ఒకచోట చేరారంటే అక్కడ సందడి వాతావరణం నెలకొనాల్సిందే. ఈ నేపథ్యంలో యువీ…విరుష్క జోడి రిసెప్షన్‌లో సందడి చేశాడు. బాలీవుడ్‌ భామ అనుష్క శర్మకు సిక్సర్ల హీరో యువరాజ్‌ సింగ్‌ ఓ ముద్దు పేరు పెట్టాడు.

హర్భజన్‌ సింగ్‌, ఆశిష్‌ నెహ్రాతో కలిసి సందడి చేస్తూ సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపాడు. కార్యక్రమం అనంతరం యువీ విరుష్క జోడీతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువీ..ముద్దుపేరుతో విషెస్‌ చెప్పాడు. అఫీషియల్‌గా రోజీ ఫ్యాబి పెళ్లి జరిగింది. కోహ్లీ-అనుష్క జోడీకి శుభాకాంక్షలు ,మీ భాగస్వామ్యం జీవితాంతం సంతోషంతో నిండాలి. చీకూ-రోజీ ఫ్యాబికి ఎంతో ప్రేమతో శుభాకాంక్షలు అని యువీ పేర్కొన్నాడు.

Anushka Sharma and Virat Kohli's Mumbai reception

విరాట్‌ కోహ్లీని సహచర ఆటగాళ్లంతా ముద్దుగా ‘చీకూ’ అని పిలుస్తుంటారు. ఇది అందిరికీ తెలిసిందే. 2015లో రణ్‌బీర్‌ కపూర్‌తో అనుష్క శర్మ నటించిన చిత్రం ‘బాంబే వెల్వెట్‌’. ఈ సినిమాలో అనుష్క పాత్ర పేరు ‘రోజీ ఫ్యాబి’. ఈ పేరుతోనే యువీ అనుష్కను పోల్చాడు.

గత సంవత్సరం యువరాజ్‌-హజల్ కిచ్‌ వివాహంలో సైతం విరుష్క జోడి సందడి చేసిన సంగతి తెలిసిందే. సంగీత్‌లో యువీ దంపతులతో కలిసి విరుష్క జోడి డ్యాన్స్‌ చేసి హంగామా చేశారు.

- Advertisement -