ముచ్చటగా మూడోసారి కాజల్, రవితేజ…

197
Ravi Teja Next Movie Heroine Kajal
- Advertisement -

టాలీవుడులో మాస్ సినిమాలకు పెట్టింది పేరు రవితేజ. ప్రస్తుతం ఆయన నేల టికెట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్ర టీజర్ ఇప్పటికే మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా ఆయన శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కొంతవరకు షూటింగ్ జరుపుకుంది. అయితే తన తదుపరి చిత్రానికి సంతోష్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. తమిళంలో విజయం సాధించిన ‘తెరి’ సినిమా కథ ఆధారంగా శ్రీనివాస్ ఈ కథను సిద్దం చేసుకున్నాడు.

ravi teja next movie heroine kajal

అయితే ఈ చిత్రంలో రవితేజకు జంటగా కాజల్ ని తీసుకోనున్నట్లు ఫిలింనగర్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే రవితేజతో వీర.. సారొచ్చారు వంటి చిత్రాలతో నటించినా.. ఆ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అందుకే అమ్మడు మూడోసారి జతకట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదని సమాచారం. అయితే ఆమెను చిత్ర యూనిట్ ఒప్పించారని తెలుస్తోంది. మరీ ఈ సారైనా ఈ జంటకు కలిసొస్తుందో లేదో చూడాలి మరీ.

- Advertisement -