పవన్‌తో రవితేజ మల్టీస్టారర్‌..!

195
Ravi Teja Multistarrer with Pawan Kalyan..!
- Advertisement -

బెంగాల్ టైగర్‌ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని రాజా ది గ్రేట్‌తో ప్రేక్షకుల ముందుకువచ్చిన రవితేజ సక్సెస్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.  ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.  రెండేళ్లుగా సరైన  స్క్రిప్టు దొరకక పోవడం వల్ల గ్యాప్ వచ్చిందని..అయ్యో గ్యాప్ వచ్చిందే అని తాను ఎప్పుడూ బాధ పడలేదని, అలాంటి ఫీలింగ్ కూడా లేదని, అస్సలు రాదని  తెలిపారు.

తెలుగులో ఏ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఇష్టపడతారు?” అనే ప్రశ్న ఆయనకి తాజా ఇంటర్వ్యూలో ఎదురైంది. “పవన్ కల్యాణ్ తో కలిసి నటించాలని వుంది. ఆయన కామెడీ టైమింగ్ నాకు బాగా నచ్చుతుంది. మా ఇద్దరి కాంబినేషన్ బాగుంటుందనేది నా అభిప్రాయం” అంటూ రవితేజ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

ఇండస్ట్రీలో తనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరని తనకు తానే బెస్ట్ ఫ్రెండ్‌ అని చెప్పుకొచ్చారు. అయితే కొద్దిమందితో మాత్రమే క్లోజ్‌గా ఉంటానని ఖాళీ సమయాల్లో వారిని కలుస్తుంటానని తెలిపారు. నేను నా సినిమాల ద్వారా ఎవరికీ మెసేజ్ ఇవ్వాలని చూడను..ఎందుకంటే ఇక్కడ మెసేజ్ తీసుకోవడానికి ఎవరూ సిద్దంగా లేరన్నారు. నా సినిమాల ద్వారా ఎంటర్‌టైన్మెంట్‌ ఇవ్వాలని చూస్తానని తెలిపారు. ప్రస్తుతం మరో మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు రవితేజ.

- Advertisement -