ప్రతీకారం తీర్చుకున్న భారత్..

263
India beat New Zealand by 6 wickets
- Advertisement -

న్యూజిలాండ్ తో జరగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. కీవిస్ విధించిన 231 పరుగుల లక్ష్యాన్ని 46  ఓవర్లలో  4 వికెట్లు కొల్పోయి చేధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్,మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ దినేష్‌ కార్తీక్ హాఫ్ సెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ధావన్ 84 బంతుల్లో 68 పరుగులు చేయగా  కార్తీక్ 64,ధోని 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. హార్ధిక్ పాండ్యా 30,రోహిత్ 7,కోహ్లీ 29 పరుగులు చేశారు.

అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ కు ఓపెనర్లు శుభారంభాన్నివ్వలేదు. గప్టిల్ (11), మున్రో (10) లను భారత పేసర్ భువీ ఔట్ చేశాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (3) సిరీస్ లో మరోసారి నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ ను సరిదిద్దాలని ఆచితూచి ఆడిన లాథమ్(38) ను అక్సర్ పటేల్ బౌల్డ్ చేయగా, మరో కీలక ఆటగాడు రాస్ టేలర్ (21) పాండ్యా చేతికి చిక్కాడు. భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆదినుంచి పరుగుల కోసం కివీస్ చెమటోడ్చింది.

India beat New Zealand by 6 wickets
నికోల్స్ (62 బంతుల్లో 42), డి గ్రాండ్ హోమ్మి(40 బంతుల్లో 41: 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో కీవిస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 230 పరుగులు చేసింది.  భారత బౌలర బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 ,బుమ్రా, చహల్ చెరో రెండు వికెట్లు తీయగా, అక్సర్ పటేల్, హార్దిక్ పాండ్యాలకు ఒక్కో వికెట్ దక్కింది.

- Advertisement -