ర‌వితేజ‌ ‘క్రాక్’ సెన్సార్‌ పూర్తి..

220
Krack
- Advertisement -

డాన్‌శీను, బ‌లుపు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘క్రాక్`. స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత బి. మ‌ధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ల‌లో క‌నిపించ‌నున్నారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

తాజాగా ఈ మూవీ సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ పొందింది. ఈ చిత్రం రిలీజ్‌ ప్రీ పోన్‌ అయ్యింది. జనవరి 9న సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. రవితేజ, రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -