స్పీడ్ పెంచిన రవితేజ….

221
- Advertisement -

బెంగాల్ టైగర్ సినిమా తర్వాత ఏడాదిన్నర పాటు మరో సినిమా చేయని మాస్ రాజా రవితేజ తాజాగా ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. విక్రమ్‌ సిరికొండ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ..టచ్ చేసి చూడు అనే మాస్ ఎంటర్‌టైనర్‌ను ముస్తాబుచేయబోతున్నాడు. అయితే తాజాగా మరో మూవీకి కూడా రవితేజ ముహూర్తం అనౌన్స్‌ చేశాడు.
Ravi Teja is Raja The Great
ఫిబ్రవరి 6వ తేదిన రవితేజ ‘రాజా ది గ్రేట్‌’ అనే మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో శిరీష్ నిర్మాతగా.. ప‌టాస్‌, సుప్రీమ్ వంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `రాజా ది గ్రేట్` సినిమా రూపొందుతుంది. ఈ చిత్రంలో.. రవితేజ ఒక అంధుడి పాత్రలో చేయనున్న చేస్తున్నాడు. గుడ్డివాడి రోల్ చేస్తున్నా.. ఇది పక్కా కమర్షియల్ మూవీ అని ఇప్పటికే చెప్పేశాడు అనిల్ రావిపూడి.

Ravi Teja is Raja The Great

ఇక ఈసినిమాలో ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ ఫేమ్ మెహ్రీన్ కౌర్ ప్రిజాద  హీరోయిన్ గా నటించనుంది. మొత్తనికి ఏడాది తర్వాత మళ్లీ మోహానికి రంగేసుకుని తన స్పీడ్‌ని పెంచేపనిలో పడ్డాడు మాస్ మహరాజా రవితేజ .

- Advertisement -