రాజా…డిస్కో రాజా

322
disco raja
- Advertisement -

ఆన్‌ స్క్రీనైనా.. ఆఫ్‌ స్క్రీనైనా రవితేజ ఎనర్జీ లెవల్సే వేరు.అమర్ అక్బర్ ఆంటోనితో అంతగా మెప్పించ లేకపోయిన మాస్ మహారాజా తాజాగా సైంటిఫిక్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి విలక్షణమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాలో రవితేజ సరసన నన్ను దోచుకుందవటే’ హీరోయిన్‌ నభా నటేశ్ హీరోయిన్‌గా నటించనుంది‌‌. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇక ఈ సినిమాకు ‘డిస్కో రాజా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుందని నిర్మాత రామ్‌ తాళ్లూరి పేర్కొన్నారు. చెన్నై, హైదరాబాద్‌, మనాలి, హిమాలయాల్లో సినిమాను చిత్రీకరించనున్నారు. బాబీ సింహా ప్రతినాయకుడిగా, సునీల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు.

- Advertisement -