గోవాలో ర‌వితేజ‌-శృతిహాస‌న్ రొమాన్స్‌‌..

149
- Advertisement -

మాస్‌ మహారాజా ర‌వితేజ‌ తాజాగా నటిస్తున్న సినిమా క్రాక్‌. గోపిచంద్ మ‌లినేని డైరెక్ట్ చేస్తున్నాడు. శృతిహాస‌న్ రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోన్న క్రాక్ మూవీని సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్.. అయితే ఈ చిత్ర ష్యూటింగ్‌ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.

ఇటీవ‌లే ఓ ల‌వ్ లీ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం ర‌వితేజ అండ్ టీం గోవాకు వెళ్లారు. ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ కంపోజిష‌న్ లో వ‌చ్చే సాంగ్ ను ప్ర‌స్తుతం ర‌వితేజ-శృతిహాస‌న్ ల‌పై షూట్ చేస్తున్నారు. కొరియోగ్రాఫ‌ర్ రాజుసుంద‌రం ఈ సాంగ్ నృత్య‌రీతులు అందిస్తున్నాడు. గోవాలోని అంద‌మైన లొకేష‌న్ల‌లో గోపీచంద్‌-ర‌వితేజ‌-శృతిహాస‌న్ అండ్ టీం క‌లిసి దిగిన ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.

- Advertisement -