RT75:రవితేజ 75 ప్రారంభం

14
- Advertisement -

టైగర్ నాగేశ్వరరావు తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు రవితేజ. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా తన 75వ సినిమాను ప్రారంభించేశారు.

భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇవాళ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్నితెరకెక్కిస్తుండగా హీరో రవితేజతో పాటు అందాల భామ శ్రీలీల కూడా హాజరయ్యారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి మొదలుపెడుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Also Read:ఏపీలో ఉచిత బస్సు..గుడ్ న్యూస్

- Advertisement -