- Advertisement -
అల్లరి, నచ్చావులే వంటి కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాలతోపాటు అనసూయ, అమరావతి, అవును, అవును 2 వంటి హారర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న దర్శక నిర్మాత రవిబాబు యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రవిబాబు దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం `క్రష్`.
నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా టైటిల్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. జనవరి 24 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే సినిమాను వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
- Advertisement -