నూతన సంవత్సర కానుకగా విభిన్న చిత్రాల దర్శకుడు నటుడు రవిబాబు తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి ఆవిరి టైటిల్ కన్ఫర్మ్ చేశారు రవిబాబు. కొత్త సంవత్సరం కానుకగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. విభిన్నంగా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇది ఒక ఆఫ్ బీట్ చిత్రమని.. త్వరలోనే చిత్ర వివరాలను, నటీనటులను ప్రకటిస్తామని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే వీటి వివరాలు బయటకు రానున్నాయి.
ఇక పోస్టర్ చూస్తుంటే.. రవిబాబు మరో హర్రర్ సినిమాతో మన రానున్నట్టు తెలిస్తోంది. ఒక గాజు సీసా లోపల నల్లని దుస్తులతో ఓ అమ్మాయి డాన్స్ చేస్తుండగా మూత తీయగానే ఆవిరి రూపంలో ఏదో దెయ్యం లాంటిది బయటికి రావడం ఇందులో చూడొచ్చు. అంటే ఆవిరి రూపంలో ఉండే దెయ్యంతో రవిబాబు ఈసారి ఏదో చేయబోతున్నాడన్న మాట. మరి ఈసారి ఎలాంటి థ్రిల్లింగ్ కథతో వస్తాడో చూడాలి. ఈ మూవీని ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు నిర్మిస్తున్నారు.