తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, ప్రొడ్యూసర్ గా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు రవిబాబు. తక్కువ బడ్జెట్ తో అల్లరి సినిమాతో నవ్వులు పూయించి మెప్పించారు. తర్వాత అవును, అనసూయ వంటి హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవిబాబు ఏం చేసిన ప్రత్యేకంగా ఉంటుంది. అదే విధంగా ప్రేక్షకులు సైతం ఆయన నుంచి కొత్తం దనం కోరుకుంటారు. తాజాగా ఆయన దర్శకత్వంలో అదిగో అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పందిపిల్లది కావడం విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆయన ఓ పంది పిల్లను కూడా పెంచుకున్నారు. అదుగో సినిమాలో ఆ పందిపిల్లేదే ప్రధాన పాత్ర. దానికి బంటి అని పేరు కూడా పెట్టారు. ఈ మధ్య బట్టికి పల్లు తోముతూ హల్ చల్ చేశాడు. ప్రస్తుతం బంటితో కసరత్తులు చేస్తున్న రవిబాబు వీడియో ఒకటి నెటింట్లో హల్ చల్ చేస్తోంది. పందిపిల్లను వీపుపై ఎక్కించుకుని వ్యాయామం చేశారు. బంటి ఫిట్ నెస్ కోసం వ్యాయామం చేస్తోంది, మరి మీరు ఎందుకు చేయరు అంటూ కామెంట్ కూడా పెట్టాడు. హామ్ ఫిట్ తో ఇండియా ఫిట్ ప్రచారంలో భాగంగా ఈ వీడియో చేశానని చెప్పారు. ఈ వీడియోపై మీరు ఒక లుక్కెయ్యండి.
When Bunty can do it, why can't you 💪 #HumFitTohIndiaFit #Adhugo #Bunty #RaviBabu pic.twitter.com/sfra0qT5oL
— BA Raju's Team (@baraju_SuperHit) July 2, 2018