విడుద‌లకు సిద్ద‌మైన‌ సంపూ ‘కొబ్బ‌రిమ‌ట్ట‌’..

239
kobbarimatta movie
- Advertisement -

మొద‌టి సినిమాతోనే త‌న న‌ట‌న‌తో టాలీవుడ్ లో త‌న స‌త్తా చాటుకున్నాడు కామెడీ హీరో సంపూర్ణేశ్ బాబు. హృద‌య కాలేయం సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మై విభిన్న‌మైన డైలాగ్ ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. తెలుగు ఇండ‌స్ట్రీలో కామెడి హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు సంపూర్ణేశ్ బాబు. సంపూర్ణేశ్ బాబు హీరోగా న‌టించిన కొబ్బ‌రి మ‌ట్ట సినిమా ప్రారంభ‌మ‌య్యి మూడు సంవ‌త్సారాలు గుడుస్తున్న కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ఇంకా విడుద‌ల కాలేదు.

kobbarimatta

త్వ‌ర‌లోనే ఆసినిమా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు హీరో సంపూర్ణేష్ బాబు. ఇక ఇదే విష‌యాన్ని త‌న ట్వీట్ట‌ర్ ద్వారా తెలిపాడు సంపూ. ఎన్నో క‌ష్టాలు దాటి ఈసినిమాను విడుద‌ల చేయ‌డానికి రెడి అయ్యాం అంటూ ట్వీట్ చేశారు. ఈసంద‌ర్భంగా ఈసినిమా గురించి మ‌రో ట్వీట్ చేశారు సంపూ.

ప్ర‌తి బ్యాచిర‌ల్ రూంలో మందు తాగే వాళ్ల‌కి బెస్ట్ స్ట‌ఫ్ కొబ్బ‌రిమ‌ట్ట అవ్వ‌బోతుంది..ఒక కొత్త ర‌కం సినిమాను చూసి న‌వ్వుకోబోతున్నారు..మాకు మీ ప్రేమ‌, మి మ‌ద్ద‌తుకావాలంటూ సంపూ ట్వీట్ చేశారు. ఈసినిమా కోసం నేను చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని..అంతేకాకుండా నార‌క్తాన్ని ధార‌పోశాను అని చెప్పాడు. ముగ్గురు భార్య‌లున్న ఒక మంచి మ‌న‌సున్న భ‌ర్త కథ ఇది అన్నారు. త్వ‌ర‌లోనే ఈసినిమా విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తామన్నారు.

- Advertisement -