రావణాసుర..మాస్ టీజర్ అదుర్స్‌

16
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. అభిషేక్ నామా నిర్మాణంలో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేశారు.

టీజర్ లో క్రైమ్ సీన్స్ ఎక్కువగా చూపించారు. పోలీసులు ఒక క్రిమినల్ కోసం వెతుకుతున్నట్టు చూపించారు. అలాగే రవితేజ, సుశాంత్ మధ్య ఫైట్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇక రవితేజ లాయర్ పాత్రతో పాటు నెగిటివ్ రోల్ లోను కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. సీతని తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు రావణాసురుడ్ని దాటాలి అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. ఏప్రిల్ 7న సినిమా రిలీజ్ కానుంది.

- Advertisement -