రామ్ చరణ్ -బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా షూటింగ్ సగం పూర్తయింది. మేకర్స్ ఒకేసారి ఎడిటింగ్ పనులను కూడా జరుపుతున్నారు. ‘ఉప్పెన’ ఫేం బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే స్టార్ హీరోపై ఒక ప్రత్యేక డాన్స్ నెంబర్‌ను చిత్రబృందం పూర్తిచేసింది.
పెద్ది సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మాట్లాడుతూ…రామ్ చరణ్ ఈ సినిమాలో కొత్త కోణాన్ని చూపిస్తున్నారని వెల్లడించారు. రామ్ చరణ్ అద్భుతమైన నటన కనబరుస్తున్నారు… ఆయన యాక్టింగ్, స్టైల్, డిక్షన్ అన్నీ గత సినిమాలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఈ సినిమా కోసం ఆయన పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు అన్నారు.
Also Read:ఖైరతాబాద్ గణేశుడి.. శోభాయాత్ర
రత్నవేలు మాట్లాడుతూ..తాను కూడా ఈ సినిమాను వేరే రీతిలో చిత్రీకరిస్తున్నాను. స్క్రిప్ట్ చాలా బలంగా ఉంది, ఇది నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. స్క్రిప్ట్ ఆసక్తికరంగా ఉంటే నేను అదనంగా కృషి చేస్తాను. ఈ సినిమా కూడా రాంగస్థలంలా స్పెషల్. మీరు గ్లింప్స్‌లో చూసారు కదా అన్నారు.

