ప్రపంచకప్‌ నుండి ఇంగ్లండ్ ఔట్!

7
- Advertisement -

వన్డే ప్రపంచకప్ 2027లో జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని విధంగా ఇంగ్లండ్ జట్టు ఈ ప్రపంచకప్ ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉన్న ఇంగ్లండ్ నేరుగా పాల్గొనే అవకాశాన్ని కొల్పోయింది.

2019లో వన్డే ప్రపంచకప్ నెగ్గిన ఇంగ్లండ్… ఆ తర్వాత 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి లీగ్ దశలోనే నిష్క్రమించింది.

ఆ తర్వాత కూడా వన్డే ఫార్మాట్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌లో పాల్గొనే అవకాశాన్ని దాదాపు కొల్పోగా 2027 ప్రపంచకప్‌లో ఆతిథ్య హోదా కలిగిన దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఆటోమేటిక్‌గా అర్హత పొందతాయి.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉన్న జట్లకే నేరుగా క్వాలిఫికేషన్ దొరుకుతుంది. ఇంగ్లండ్ ఎనిమిదో స్థానంలో ఉండడం వలన, ఆతిథ్య దేశాలను దృష్టిలో ఉంచితే, జట్టు తొమ్మిదో స్థానానికి పడిపోతుంది. గత ఏడాదిలో కేవలం మూడు వన్డే మ్యాచులు గెలిచింది ఇంగ్లండ్ . ఈ పరిస్థితి కొనసాగితే, జట్టుకు 2027 ప్రపంచకప్ కోసం క్వాలిఫయర్స్ ఆడాల్సి వస్తుంది.

Also Read:ఖైరతాబాద్ గణేశుడి.. శోభాయాత్ర

- Advertisement -