తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ!

348
ratnaprabha
- Advertisement -

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ… అభ్యర్ధిని ప్రకటించింది. తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గా రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభను అధికారికంగా ప్రకటించింది. ఆమె గతంలో కర్ణాటక సిఎస్ గా రత్నప్రభ పని చేశారు.

తిరుపతి ఉప ఉన్నికల కోసం సుదీర్ఘ కసరత్తు చేసిన బీజేపీ..చివరకు రత్నప్రభ పేరును ఫైనల్ చేసింది. ఏప్రిల్ 17న ఈ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఈ ఉప ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.

అధికార వైసీపీకి చెందిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా వైరస్ బారినపడి కన్నుమూయడంతో.. తిరుపతి లోక్‌సభ స్థానానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. వైసీపీ నుండి గురుమూర్తి, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి బరిలో ఉన్నారు.

- Advertisement -